Phone tapping case:
ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ(Telangana) వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేయడంతో ఇప్పుడు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో అరెస్టైయిన అదనపు ఎస్‌పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, డీఎస్‌పీ ప్రణీత్ రావులు.. వ్యాపారవేత్తలు, హవాలా వ్యాపారులు, నగల షాపు యజమానులపై బెదిరింపులకు పాల్పడి భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఇలా కూడబెట్టిన ఆస్తుల్లో ఖరీదైన విల్లాలు, భూములు ఉన్నట్టు గుర్తించారు. ఏసీబీ అధికారులు ఈ కేసుపై దృష్టి సారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన వారితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ఆస్తుల చిట్టాను బయటకు తీసే పనిలో పడ్డారు. దీంతో ఈ కేసులో అరెస్టైయిన వారితో పాటు అనుమానితులు కూడా హడలెత్తిపోతున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: కళ తప్పిన కేబుల్ బ్రిడ్జి..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి