Suryapet:
సూర్యాపేట జిల్లా కోదాడ కోర్టు(Kodada Court)లో అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించడంతో రికార్డులు(Records) దగ్ధమయ్యాయి. జూనియర్ సివిల్ జడ్జ్ మరియు జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు రికార్డు గదిలో భద్రపరిచి ఉన్న బీరువాలోని పలు రికార్డులు విద్యుత్ షార్ట్ సర్క్యూట్(Electrical Short Circuit) కారణంతో దగ్ధమయ్యాయి. జడ్జి ఛాంబర్ వెనకాల ఉన్న విద్యుత్ బోర్డ్ లో జరిగిన షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో అదే బోర్డుకు వెనకాల ఉన్న మరొక బోర్డు ద్వారా రికార్డులు బద్ధపరిచిన బీరువాకు మంటలు అంటుకున్నాయి. దీంతో లోపల ఉన్న రికార్డులు దగ్ధమయ్యాయి. పట్టణ సీఐ రాము సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: తెలంగాణలో ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలు..!
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి