అన్నమయ్య జిల్లా, పీలేరు(peeleru) లో ఘరానా మోసగాడు(cheating) అరెస్ట్…
మోసగాడి అకౌంట్లో రూ. 33 లక్షలు ఫ్రిజ్. ఫార్చునర్ వాహనంతో పాటు సెల్ ఫోన్ స్వాధీనం. పెట్టుబడి పెట్టిన 20 వారాలలో రెట్టింపు సొమ్ము ఇస్తామంటూ పలువురి వద్ద రుణాలు 8 కోట్లు వసూలు. ఘరానా మోసగాన్ని అరెస్ట్ చేసి అతని అకౌంట్లో ఉన్న రూ. 33 లక్షల నగదు ఫ్రిజ్ చేశారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా, పీలేరులో చోటుచేసుకుంది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పీలేరు అర్బన్ సీఐ మోహన్ రెడ్డి కథనం మేరకు, బాలన్న హైజాక్ అనే ఇరువురు విన్ ఇండియా ఆయుర్వేదిక్ కంటిక్ అండ్ జనరల్ స్టోర్స్, మహిమ ఆయుర్వేదం అనే రెండు కంపెనీల పేరిట ఘరానా మోసానికి పాల్పడ్డారు. లక్ష పెట్టుబడి పెడితే 20 వారాలలో రెట్టింపు సొమ్ములు ఇస్తామని పలువురిని మాయమాటలతో నమ్మించారు. పలువురి వద్ద రూ. 8 కోట్ల వరకు వసూలు చేసి ఘరానా మోసానికి పాల్పడ్డారు. బాధితుడు టీచర్ ఖాదర్ బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పీలేరు అర్బన్ పోలీసులు. ఘరానా మోసగాడు బాలనను మంగళవారం పీలేరు శివారు ప్రాంతం టిటిడి కళ్యాణ మండపం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మోసగాడి వద్ద ఫార్చునర్ వాహనంతో పాటు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మోసగాడి అకౌంట్లో ఉన్న రూ 33 లక్షల నగదును పోలీసులు ఫ్రీ చేశారు. మరో నిందితుడు హైజాక్ కోసం పోలీసులు ముందరంగా గాలిస్తున్నట్లు తెలిపారు పీలేరు అర్బన్ సిఐ మోహన్ రెడ్డి .
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి