ఏపీలో ఎన్నికల వాతావరణం:
ఏపీలో ఎన్నికల వాతావరణంతో పొలిటికల్ పార్టీ(Political Party)లన్నీ ప్రచారాలను స్పీడప్ చేశాయి. రెండోసారి అధికారం టార్గెట్‌గా వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎన్నికల ప్రచార క్షేత్రంలోకి దిగనున్నారు. మేమంతా సిద్ధం(Memantha Siddham) పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్ఆర్ కడప(Kadapa) జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రచార పర్వాన్ని ప్రారంభిస్తారు. ఈ యాత్ర ఇచ్ఛాపురం వరకు దాదాపు 21 రోజులపాటు కొనసాగనుంది. ఇవాళ ఉదయం 10 గంటల 56 నిమిషాలకు తాడేపల్లి(Tadepalli)లోని నివాసం నుంచి సీఎం జగన్( CM Jagan) కడపకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాల వరకు వైఎస్ఆర్ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం ఒంటి గంటా 30 నిమిషాలకు బస్సు యాత్ర(Bus Yatra)ను ప్రారంభిస్తారు. ఈ బస్సు యాత్ర వేంపల్లి, వీఎన్.పల్లి, యర్రగుంట్ల మీదుగా పొద్దుటూరు చేరుకుంటుంది. సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులో జరగనున్న బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ చేరుకుని సీఎం జగన్ రాత్రి అక్కడ బస చేస్తారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: ఇంటికి కిలో బంగారమిచ్చినా మీకు ఓటమి తప్పదు జగన్!
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి