టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) వెనక బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) ఉన్నాయన్నారు సీఎం జగన్మోహన్రెడ్డి(CM Jagan Mohan Reddy). ఒకరు ప్రత్యక్షంగా మరొకరు పరోక్షంగా మద్దతిస్తున్నాయని విమర్శించారు. ఒక్క జగన్ మీదకు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ ఎగబడుతున్నారని మండిపడ్డారు. ఇంత మంది తోడేళ్లు ఏకమై తన మీద యుద్ధానికి వస్తున్నారని తెలిపారు. పెత్తందార్లకు, నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
ఇది చదవండి: లేపాక్షిలో బాలయ్య రెండవ రోజు ఎన్నికల ప్రచారం..
సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం(Memantha Siddham)’ బస్సు యాత్ర 21వ రోజు(Bus Yatra 21 day) విశాఖపట్నం (Visakhapatnam), విజయనగరం జిల్లా(Vizianagaram District)లో కొనసాగింది. ఈ సందర్భంగా చెల్లూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష కూటమిపై నిప్పులు చెరిగారు. ప్రజలను మోసాలతో వంచించడమే చంద్రబాబు పని అంటూ ధ్వజమెత్తారు. ప్రజలకు మంచి చేసిన జగన్‌పై తోడేళ్లు దాడికి దిగుతున్నాయని దుయ్యబట్టారు. మీ బిడ్డకు తోడుగా దేవుడి దయ, కోట్ల ప్రజల హృదయాలు ఉన్నాయన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్లో అక్కినేని నాగార్జున.అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ…
- నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.సిక్కింలో భారీ విషాదం చోటుచేసుకుంది. దక్షిణ సిక్కింలోని సమర్దుంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందారు. వారి మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 20 మందికిపైగా…
- ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు కొత్త ఛాంపియన్ దక్కింది. న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ అదనపు సమయంలో 1-0తో విజయం సాధించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హాజరుకావడంతో..ఈ మ్యాచ్‌తో పాటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 221460