అనకాపల్లి జిల్లాలోని చారిత్రక పంచదార్ల కొండను నాన్ మైనింగ్ జోన్‌గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. గత జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశంలోనే జిల్లాలోని ప్రజాప్రతినిధులందరి ఏకాభిప్రాయంతో ఈ మేరకు తీర్మానం చేశామని మంత్రి తెలిపారు. పంచదార్ల కొండపై ఇప్పటివరకు జరిగిన మైనింగ్‌పై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని, విచారణ నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ప్రాంత ప్రాధాన్యతను దృష్ట్యా దీనిని రిజర్వ్ ఫారెస్ట్ జోన్‌గా మార్చడంతో పాటు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి అప్పగించేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేశామని వెల్లడించారు.
పంచదార్ల కొండను నాన్‌మైనింగ్ జోన్‌గా మార్పు – కొల్లు.
31
previous post



Total views : 221432