Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Andhra Pradesh ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఏపీ మంత్రులు కీలక భేటీ.

ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఏపీ మంత్రులు కీలక భేటీ.

by CVR NEWS
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఏపీ మంత్రులు కీలక భేటీ

ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ఆక్వా, పొగాకు రంగాల సమస్యలపై కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల బృందం నేడు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులతో విడివిడిగా భేటీ అయింది. కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌లను కలిసిన ఏపీ మంత్రుల బృందం.. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి వినతిపత్రాలు సమర్పించింది. అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుతో పాటు, అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్యల ధరలు పడిపోవడం వల్ల ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పొగాకు ఎగుమతిదారులకు కేంద్ర పథకాల ద్వారా ప్రోత్సాహకాలు అందించాలని కోరారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

042040
Total views : 221433

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: