Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Andhra Pradesh పది, ఇంటర్‌లో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులు.

పది, ఇంటర్‌లో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులు.

by CVR NEWS
పది, ఇంటర్‌లో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులు

పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ పేరుతో ప్రశంసా పత్రాలు, నగదు ప్రోత్సాహకాలను అందజేసింది. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పెంటకోట కన్వెన్షన్ హాల్‌లో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణ పర్యవేక్షణలో ‘షైనింగ్ స్టార్స్’ పురస్కార ప్రదానోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మెరిట్ సాధించిన 4 వేల 344 మంది పదో తరగతి విద్యార్థులకు, 978 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ ప్రశంసా పత్రాలతో పాటు 20 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అందులో భాగంగానే అనకాపల్లి జిల్లాలో పదో తరగతిలో 154 మందికి, ఇంటర్‌లో 34 మందికి నేడు ఈ అవార్డులను అందజేసినట్లు వెల్లడించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

042040
Total views : 221435

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: