కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)లో విచారణ…
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) లో ఈ రోజు విచారణ జరగనుంది. తన చిన్న కొడుకు పరీక్షల దృష్ట్యా ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని రౌస్ అవెన్యూ కోర్టులో మార్చి 26న ఆమె పిటిషన్ దాఖలు చేశారు. కవిత బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించిన రౌస్ అవెన్యూ కోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది.
కవిత చేసిన ఫిర్యాదుపై కోర్టు దర్యాప్తు..
దీంతో పాటుగా తీహార్ జైలులో అధికారులు ఏ ఒక్క వసతి కల్పించలేదని కవిత చేసిన ఫిర్యాదుపైన కోర్టు ఇవాళే దర్యాప్తు జరపనుంది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రౌస్ అవెన్యూ కోర్టు కవితకు బెయిల్ ఇస్తుందా లేదా అన్నది హాట్ టాపిక్‌గా మారింది.
ఇది చదవండి : ఆంద్రా-ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టుల భీభత్సం
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి