తెలంగాణ(Telangana) రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులలో తీవ్రమైన ఎండలు..
తెలంగాణ రాష్ట్రంలో ఎండ దంచికొడుతుంది రాబోయే ఐదు రోజుల పాటు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని, వడగాడ్పుల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ 15 జిల్లాలకు ఎండలపై ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాత్రిపూట కూడా టెంపరేచర్లు పెరుగుతాయని హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ(North Telangana) జిల్లాల్లో వడగాడ్పుల ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
ఇది చదవండి: నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి , భట్టి విక్రమార్క
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వడగాడ్పులు ఎక్కువగా వీచే ముప్పు ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో టెంపరేచర్లు 3 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదముందని వాతావరణశాఖ హెచ్చరించింది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి