Peddapalli
తెలంగాణ(Telangana) రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులలో తీవ్రమైన ఎండలు..
తెలంగాణ రాష్ట్రంలో ఎండ దంచికొడుతుంది రాబోయే ఐదు రోజుల పాటు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని, వడగాడ్పుల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ 15 జిల్లాలకు ఎండలపై ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాత్రిపూట కూడా టెంపరేచర్లు పెరుగుతాయని హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ(North Telangana) జిల్లాల్లో వడగాడ్పుల ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
ఇది చదవండి: నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి , భట్టి విక్రమార్క
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వడగాడ్పులు ఎక్కువగా వీచే ముప్పు ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో టెంపరేచర్లు 3 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదముందని వాతావరణశాఖ హెచ్చరించింది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణతో సహా మరో నాలుగు రాష్ట్రాల ఎంపీ అభ్యర్థులపై కాంగ్రెస్ హైకమాండ్ సుధీర్ఘంగా చర్చించింది. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి టికెట్ ఆశిస్తున్న అశావహుల జాబితాను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హైకమాండ్ ముందుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటేందుకు అన్ని వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ కాసేపట్లోనే ప్రకటించే అవకాశం ఉంది. ఆ జాబితాలో కరీంనగర్ నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, నల్గొండ నంచి జానారెడ్డి లేదా పటేల్ రమేష్ రెడ్డి, మహబూబ్నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, నాగర్ కర్నూల్ సంపత్ లేదా మల్లు రవి పేర్లు ఉండే అవకాశం ఉంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: నాగర్ కర్నూల్ పార్లమెంట్ ప్రజలకు త్వరలోనే శుభవార్త…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
పెద్దపల్లి జిల్లాలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. పెద్దపల్లి నియోజకవర్గం లో ఆర్వో కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియకు అన్ని సిద్దం చేశారు.ఆర్వో కార్యాలయాల వద్ద నామినేషన్ దాఖలు చెయ్యడం కోసం సందేహాలను నివృత్తి చెయ్యడం కోసం ఆయా కేంద్రాలలో హెల్ప్ డెస్క్ లకు ఏర్పాటు చేశారు. అలాగే ఆర్వో కార్యాలయాల పరిసర ప్రాంతాలలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తూ పటిష్ట బందోబస్తు ను ఏర్పాటు చేశారు. కేంద్రాల చుట్టూ వంద మీటర్ల దూరం లో మార్క్ చేసి బారికేడ్లను ఏర్పాటు చేశారు. పెద్దపల్లి ఆర్వో కార్యాలయానికి బందోబస్తుని ఏర్పాట్లును పెద్దపల్లి డిసిపి Dr.చేతన మరియు ఎసిపి ఎడ్ల మహేష్ పరిశీలించారు.





Total views : 78009