ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో ఏప్రిల్ 15 వరకు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) ఆదేశించింది. దీంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal)ను ఢిల్లీ పోలీసు(Delhi Police)లు తీహార్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే జైలులో చదువుకోవడానికి పుస్తకాలు, ఇంట్లో చేసిన ఆహారానికి అనుమతించాలంటూ కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనకు కోర్టు ఆమోదం తెలిపింది.
ఇది చదవండి: నేటి నుంచి పెరగనున్న మెడికల్ ధరలు…
భగవద్గీత, రామాయణం, ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ ఈ మూడు పుస్తకాలను కేజ్రీవాల్‌కు అందించేందుకు కోర్టు అనుమతించింది. కేజ్రీవాల్ తన ఇంట్లో వండిన భోజనం, మందులు, ఇంట్లో వాడే పరుపులు, దిండ్లతో పాటు ఇతర నిత్యావసరాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు జైలులో ఆయనకు మతపరమైన లాకెట్ కేటాయింపునకు కూడా అనుమతిచ్చింది. జైలు మాన్యువల్ ప్రకారం వైద్యులు సూచించిన విధంగా ఒక టేబుల్, కుర్చీలకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి