ఏపీ(Andhra Pradesh)లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. ఈ క్రమంలో స్కూళ్లకు ఏపీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 50 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు రానున్నాయి. ఎండల కారణంగా మార్చి 18 నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నడుస్తున్నాయి. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రస్తుతం బడులను నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: ఎన్నికల ముందు జగన్‍కు భారీ షాక్…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి