నరసింహ స్వామి(Narasimha Swamy)..
వేదాద్రి క్షేత్ర మహాత్మ్యాన్ని(Vedadri Kshetra Mahatyam) గురించిన ప్రస్తావన శ్రీనాథుడి ‘కాశీ ఖండం(Kasikhandam)’ లో కనిపిస్తుంది. ‘వేదాద్రి(Vedadri)’ నరసింహ స్వామి అవతరించిన అత్యంత శక్తివంతమైన క్షేత్రాలలో ఒకటి. వేదాలను తనలో నిక్షిప్తం చేసుకున్న పర్వత ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి వేదాద్రి అనే పేరు వచ్చింది. కృష్ణానది తీరంలో కొలువుదీరి పుణ్య ఫలాలను అందించే ఈ దివ్య క్షేత్రం కృష్ణా జిల్లాకి వన్నె తెస్తూ భక్తుల హృదయాలను గెలుచుకుంటూ వుంది. ఇక స్థలపురాణం ప్రకారం ‘సోమకాసురుడు’ అనే రాక్షసుడు బ్రహ్మ దేవుడి దగ్గర నుండి వేదాలను అపహరించి వాటిని సముద్రగర్భంలో దాచేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యవతారమెత్తి సోమకాసురుడిని సంహరించి వేదాలను రక్షించాడు. అప్పుడు వేదాలు స్వామివారి సన్నిథిలో తరించే భాగ్యాన్ని కలిగించమని కోరడంతో నరసింహవతారంలో హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం ఆ కోరిక తీరుతుందని స్వామి చెప్పాడు. తనని అభిషేకించాలని ‘కృష్ణవేణి’ కూడా ఆరాట పడుతుందనీ, అందువల్ల తాను వచ్చేంత వరకూ ఈ నదిలో సాలగ్రామ శిలలుగా వుండమంటూ అనుగ్రహించాడు. ఆ తర్వాత హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం, స్వామి అక్కడే అయిదు అంశలతో ఆవిర్భవించాడు.
ఇది చదవండి: శ్రీశైలం ఉగాది మహోత్సవాల ఏర్పాట్లు ముమ్మరం
జ్వాలా నరసింహ స్వామి’.. సాలగ్రామ నరసింహ స్వామి.. వీర నరసింహ స్వామి, యోగానంద నరసింహ స్వామి.. లక్ష్మీ నరసింహ స్వామి అనే అయిదు అంశలతో అవతరించిన స్వామి భక్తులపాలిట కొంగు బంగారమై అలరారుతున్నాడు. అయితే ఈ అయిదు అంశాలతో అవతరించిన స్వామి భక్తులపాలిట కొంగు బంగారమై అలరారుతున్నాడు. అయితే ఈ అయిదు అంశాలలో ప్రధాన మూర్తిగా.. ప్రత్యేక శక్తిగా యోగానంద నరసింహ స్వామి’ పూజలందుకుంటూ ఉంటాడు. ఇక కలియుగారంభంలో మానవులు తపస్సులు చేయవలసిన అవసరం లేదనీ, దైవ నామస్మరణ చేస్తే చాలని వ్యాస భగవానుడు చెప్పాడు. దాంతో బుషులంతా దైవ నామ సంకీర్తన చేస్తూ దేశాటన చేయసాగారు. ఆ సమయంలోనే కృష్ణానది నదీ తీరంలోగల పర్వతంపై నుంచి వేదాలు వినిపించడం వారికి ఆశ్చర్యం కలిగించింది. వేద పురుషులతో సహా శ్రీ మన్నారాయణుడు నరసింహ అవతారంలో అక్కడ వెలిశాడని తెలుసుకుని దర్శించి తరించారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి