రాష్ట్రంలో శుక్రవారం నాటికి సామాజిక భద్రతా ఫించన్ల పంపిణీ ప్రక్రియ 94 శాతం పూర్తయిందని అనగా 1847 కోట్ల 52 లక్షల రూ.లను ఫించన్ దారులకు పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ తెలియ జేశారు. రాష్ట్రంలో 65.69 లక్షల మంది ఫించను దారులకు ఫించన్లు అందించేందుకు 1951 కోట్ల 69 లక్షల రూ.లను విడుదల చేయగా ఈనెల 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఫించన్లు పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.
శుక్రవారం సాయంత్రానికి 94 శాతం మంది ఫించన్ దారులకు 1847 కోట్ల 52 లక్షల రూ.లను పించన్లుగా అందించడం జరిగిందని శశి భూషణ్ కుమార్ పేర్కొన్నారు. మిగతా ఫించన్ దారులకు వారి ఇళ్ళ వద్దకే వెళ్ళి పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుండే ఫించన్లు పంపిణీ చేపట్టి నూరు శాతం ఫించన్లు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ తెలియజేశారు.