ఆఫ్రికా దేశం(Africa Country) మొజాంబిక్(Mozambique) తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ పడవ మునగడంతో 90 మందికి పైగా జల సమాధి అయ్యారు. కాగా, ప్రమాద సమయంలో పడవలో 130 మంది వరకు ఉన్నట్లు సమాచారం. బోటు సామర్థ్యానికి మించి ప్రయాణించడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని అక్కడి అధికారులు వెల్లడించారు. మృతుల్లో అధిక సంఖ్యలో పిల్లలు ఉన్నట్టు స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఫెర్రీని చేపల పడవగా మార్చి అధిక సంఖ్యలో ప్రయాణించడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఇది చదవండి: GT vs PBKS IPL 2024 | గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
ఇక ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు కలరా వ్యాప్తి అంటూ వదంతుల నేపథ్యంలో ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకుని దీవుల్లోకి వెళ్తున్నట్లు నాంపుల ప్రావిన్స్ సెక్రటరీ జైమ్ నెటో వెల్లడించారు. ఇలా వెళ్తుండగా ఈ పడవ మునిగిందని అన్నారు. ఇదిలాఉంటే.. మొజాంబిక్ దేశంలో గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 15 వేల కలరా కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అలాగే 32 మంది మరణించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి