మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishore) ఏపీ రాజకీయాల(AP politics)పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జగన్ మళ్లీ అధికారంలోకి రావడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చే ఒక్క పని కూడా జగన్ చేపట్టలేకపోయారని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. జగన్ ఒక ప్రొవైడర్ గానే ఉండిపోయారని, చక్రవర్తుల మాదిరిగా తాయిలాలతోనే జగన్ సరిపెట్టారని ప్రశాంత్ కిశోర్ వివరించారు. ప్రజలకు నగదు బదిలీ చేశారే తప్ప, ఉద్యోగాలు కల్పించలేదని అన్నారు. ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తరహాలోనే జగన్ కూడా పరిపాలన సాగించారని తెలిపారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: ఈతకు పోయి చనిపోయిన పిల్లలు
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి