హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) :
ఉగాది పండుగ వేళ నగరవాసులకు హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) శుభవార్త చెప్పింది. మార్చి 31తో ముగిసిన పలు రాయితీలను తిరిగి పొడగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉగాది వేడుకల్లో భాగంగా సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ పీక్ అవర్ ఆఫర్లను 6 నెలల పాటు పెంచుతున్నామన్నారు. కాగా ఇప్పటివరకు అందించిన రాయితీలకు మంగళం పాడుతున్నట్టుగా రెండు రోజుల క్రితమే మెట్రో రైల్ అధికారులు ప్రకటించారు.
ఇది చదవండి : నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజుల్లో తరగతులు…
ఉదయం, రాత్రి వేళల్లో అందించే 10 శాతం రాయితీని ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక రూ.59 కే ప్రయాణ సౌలభ్యం కల్పించే సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు, రద్దీ లేని సమయాల్లో ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం తగ్గింపు అందించే సూపర్ ఆఫ్ పీక్ అవర్, మెట్రో స్టూడెంట్ పాస్‌లపై రాయితీలన్నీ మార్చి 31 తోనే ముగిశాయి. దీంతో రాయితీలు పొడగించకపోవడంపై మెట్రో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేసారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి