నరసాపురం రాజకీయం (Narasapuram politics) :
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం రాజకీయం (Narasapuram politics) రసవత్తరంగా మారింది. ఎన్నికలలో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు అతని అనుచరులు తెలిపారు. ప్రస్తుతం అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు కే తిరిగి టికెట్ కేటాయించింది. ఎన్డీఏ కూటమి తరపున జనసేన పార్టీ అభ్యర్థిగా అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ కు సీటు దక్కింది. నియోజకవర్గంలో సుమారు 70 వేల పైబడి ఓటు బ్యాంకు కలిగిన సామాజిక వర్గాన్ని అన్ని పార్టీలు నిర్లక్ష్యం చేయడానికి ఆ సామాజిక వర్గం జీర్ణించుకోలేక పోతుంది.
ఇది చదవండి : పవన్ కల్యాణ్ ను కలిసిన RRR..
అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన తమ సామాజిక వర్గాన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేయడంతో ఈ సామాజిక వర్గంలోని నాయకులే కాక సాధారణ ఓటర్లు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన ఎవరైనా ఎన్నికల బరిలో నిలిస్తే వారిని గెలిపించుకుంటామని అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఈ దశలో అన్ని సామాజిక వర్గాలకు అత్యంత ఆప్తుడుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు బరిలోకి రావటంతో ఆ సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాల్లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల బరిలోకి దిగితే రాజకీయ సమీకరణాలు మారగలవని విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.