Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పలమనేరు మండలం మొరం పంచాయతీ కురప్పల్లి గ్రామానికి చెందిన పలువురు తిరిగి టిడిపి (TDP) గూటికి చేరారు. వైకాపా నాయకులు బలవంతంగా కండువాలు కప్పడంపై మనస్థాపం చెందిన వారు గురువారం సాయంత్రం మాజీ మంత్రి అమర్నాథరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ పనులకు వెళ్తున్న తమకు బలవంతంగా వైకాపా కండువాలు కప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో తాము తిరిగి టిడిపి కండువాలు కప్పుకోవాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి నీచమైన పనులకు వైకాపా నాయకులు దిగడంతో గ్రామస్తులంతా మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీలో చేరాల్సి వచ్చిందన్నారు. దిగజారుడు రాజకీయాలు చేస్తే ఇలాంటి పరిణామాలు జరుగుతాయని వారు తెలిపారు.
ఇది చదవండి: యరపతినేని. శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు..
పార్టీలో చేరిన వారిలో…
కురుపల్లి గ్రామానికి చెందిన బగిసి రెడ్డి, గోవిందరాజులు, జయ రాములు, సుబ్రహ్మణ్యం, వెంకటేష్, గజేంద్ర రెడ్డి, నటరాజన్, గోపి, రాజు, అదేవిధంగా కూర్నిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు, బుజ్జి తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు రెడ్డి, గణేష్, గాలి రామచంద్ర నాయుడు, వెంకటముని రెడ్డి, ద్వారకనాథరెడ్డి, కవీంద్ర నాయుడు, నాగరాజు, అనిల్ తదితరులు ఉన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.