అన్నమయ్య జిల్లా…రాజంపేట పట్టణం(Rajampet)
శుక్రవారం ఎన్డీయే కూటమి సమావేశం భారీ ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్య క్షుడు చమర్తి జగన్ మోహన్ రాజు అధ్యక్షత వహించారు.బీజేపీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి,టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాల సుబ్రమణ్యం,ఎమ్మెల్సీ సి.రామ చంద్రయ్య, బిజెపి పార్లమెంట్ జిల్లా ఇన్చార్జి సాయి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…| Nallari Kiran Kumar Reddy
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి బిజెపి పార్లమెంట్ రాజంపేట అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…ఒక్క అవినీతి ఆరోపణలేని నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎన్డీయే కూటమి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేశారనీ,ఇక్కడికి వచ్చాక సమస్యలు కుప్పలు తేప్పలుగా ఉన్నాయనీ అన్నారు. అసలు ప్రభుత్వం ఇక్కడ ఉందా అని అనుమానం వస్తుంది అన్నారు.అన్నమయ్య డ్యామ్ కొట్టుకు పోవడానికి ఇసుక దందా,ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం అన్నారు. అధికారికంగా కొంత,అనధికారికంగా మరింత ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిందనీ ఆరోపించారు. ఇటువంటి వారికి మనం ఓటు వేయాలా అని ప్రశ్నించారు. ఇండియా కూటమి నిలబెట్టిన తనకు, ఎమ్మెల్యే అభ్యర్థి సుగ వాసి బాలసుబ్రహ్మణ్యం కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: రాజంపేట లో భారీ ఎత్తున ఎన్డీయే కూటమి సమావేశం