హరీశ్ రావు (Harish Rao) :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద సరుకులేదని, అందుకే ఆయన వద్ద అన్నీ లీకు, ఫేకు వార్తలేనని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఆయన మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని, ఆ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు. బీజేపీని గెలిపించేందుకు కొన్నిచోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను బరిలో నిలిపిందని మండిపడ్డారు. కరీంనగర్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ వంటి చోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని పేర్కొన్నారు.
ఇది చదవండి : ఈ నెల 14 న కరీంనగర్ లో దీక్ష చేస్తున్నాం- పొన్నం ప్రభాకర్
కాంగ్రెస్ పార్టీపై కోపంతో బీజేపీకి ఓటు వేస్తే మనం నష్టపోతామని హెచ్చరించారు. బీజేపీ బడేమియా… కాంగ్రెస్ చోటేమియా అని ఎద్దేవా చేశారు. రెండు అబద్దాల పార్టీలే అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటి కావడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నాలుగు నెలలకే వ్యతిరేకత వచ్చిందన్నారు. ఆ పార్టీలోనూ లుకలుకలు ప్రారంభమయ్యాయన్నారు. డిసెంబర్ 9వ తేదీలోపు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి మాట తప్పారన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News