నైట్ ఫ్రాంక్ ఇండియా-కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (Knight Frank India – Confederation of Indian Industries)
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ టాప్ 10 లో చోటు దక్కించుకుంది. నైట్ ఫ్రాంక్ ఇండియా-కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (Knight Frank India – Confederation of Indian Industries) కలిసి ‘రియల్ ఎస్టేట్ : ఎ డికేట్ ఫ్రమ్ నౌ 2024’ (Real Estate: A Decade from Now to 2024) పేరుతో ఓ నివేదికను విడుదల చేశాయి. 2019-2035 వరకు హైదరాబాద్ గణనీయమైన అభివృద్ధి సాధించనుందని అంచనా వేసింది. రియల్ ఎస్టేట్ బూమ్ వల్ల అభివృద్ధి వేగంగా జరుగుతోందని పేర్కొంది. 2018లో హైదరాబాద్ 8.47 శాతం అభివృద్దితో స్థూల జాతీయోత్పత్తి 50.6 బిలియన్ల డాలర్ల వద్ద ఉంది.
ఇది చదవండి : కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ యార్డ్ పర్యటన..
2035 నాటికి అది 201.4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. నివేదిక ప్రకారం సూరత్ మొదటి స్థానంలో ఉండగా, ఆగ్రా, బెంగళూరు మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. బెంగళూరు, పుణె, హైదరాబాద్ నగరాల్లో ఐటీ కారణంగా రియాల్టీ బూమ్ అధికంగా ఉందని పేర్కొంది. 2004 నుంచి హైదరాబాద్ 4.836 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సేకరించినట్లు తెలిపింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్…