తిరుపతి నియోజకవర్గం(Tirupati Constituency) నుంచి వైసీపీ(YCP)ని తరిమి కొట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు. తిరుపతిలో ఇరుపార్టీల నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించిన పవన్, ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన సమన్వయంతో అడుగులు వేయాలని ఇరు పార్టీల నాయకులను అయన ఆదేశించారు. వైసీపీ ఓటమితోనే తిరుపతి నియోజకవర్గ ప్రజలు స్వేచగా ఊపిరి తీసుకోగలరని జనసేనాని తెలిపారు. వైసీపీ చేస్తున్న అప్రజాస్వామిక చర్యలకు, గూండా గిరీని అడ్డుకోవలసిన సమయం వచ్చింది. ఇది మన అందరి సమష్టి బాధ్యతని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తున్నామని. ఈ క్రమంలో సీట్ల సర్దుబాటులో ఎన్నో చర్చలు చేశామని. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు తిరుపతి విషయంలో ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చారని పవన్ తెలిపారు.
ఇది చదవండి: వైసీపీ పార్టీకి భారీ షాక్..!
2019 ఎన్నికల్లో దాదాపు గెలిచేసిన సుగుణమ్మ విషయంలో వైసీపీ అనుసరించిన కుయుక్తులు కూడా ఇప్పటికి ఎవరం మరచిపోలేదన్నారు.. ఇక ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి కూటమి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయానికి వచ్చామని.. మా పార్టీకి నాయకులు, కార్యకర్తల బలాన్నీ ఉత్సాహాన్నీ జోడించడం చాలా అవసరం. ఇందుకోసం తెలుగుదేశం నాయకులు అన్ని విధాలా ప్రతి దశలో అండగా ఉండాలని పవన్ కోరారు. టీడీపీకి ఉన్న సంస్థాగత నిర్మాణ బలాన్ని మనకు ఉన్న జనాదరణను జోడించి ఈ ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించుకుందాము అన్నారు. ఇక ఇదే సమావేశానికి మూడు పార్టీల ముఖ్యనేతలు హజరైయ్యి తమ సందేశాలను, సూచనలను కార్యకర్తలకు అందించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.