జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో అసెంబ్లీ ఎన్నికలు ఇక ఎంతోదూరంలో లేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని, శాసన సభ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేలతో, మంత్రులతో చెప్పుకోవచ్చని తెలియజేశారు.
ఇది చదవండి: కవితపై సీబీఐ సంచలన ఆరోపణలు..
గతంలో జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదుల నుంచి ఎన్నికల బహిష్కరణ పిలుపులు వినిపించేవని, ప్రస్తుతం అవన్నీ చరిత్రలో కలిసిపోయాయని పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదం, బాంబు దాడులు, రాళ్ల దాడులు, కాల్పులు, ఘర్షణలు, భయాందోళనల ప్రసక్తి లేకుండా ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగబోతున్నాయని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లోని ఉద్ధంపూర్‌లో, రాజస్తాన్‌లోని బార్మర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.