వన్ నేషన్.. వన్ ఎలక్షన్ (One Nation.. One Election) :
వన్ నేషన్.. వన్ ఎలక్షన్ (One Nation.. One Election) : కాంగ్రెస్‌కు కొంచెమైనా సిగ్గుండాలని, అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ రద్దు చేస్తాం, ట్రిపుల్ తలాక్‌ను తిరిగి అమలు చేస్తామని చెప్పడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఐదేండ్లలో పేదలు, మహిళలు, యువకులు, రైతులు ఈ నాలుగు సెక్టార్లపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించనుందని, దీనికి అనుగుణంగానే మేనిఫెస్టో ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇది చదవండి : కొండాపూర్ చౌరస్తా లోని పవర్ మ్యాక్స్ ఫిట్నెస్ సెంటర్ లో అగ్నిప్రమాదం….
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అందించాలని చట్టం చేశామని, జనగణన పూర్తయ్యాక దీన్ని అమలుచేస్తామని ఆయన స్పష్టంచేశారు. పోస్టాఫీసులను సోషల్ సెక్యూరిటీ కేంద్రాలుగా ఉపయోగించాలని, విలేజ్ బ్యాంకింగ్‌గా ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వన్ నేషన్.. వన్ రేషన్ లాగే.. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అవసరమని, అనేక దేశాల్లో ఈ విధానం ఉందని, భారత్‌లో కూడా వస్తే.. అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించవచ్చని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: వన్ నేషన్.. వన్ ఎలక్షన్…