కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గం: ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ అఫిడవిట్ లో పొందుపరిచిన అంశాలపై శుక్రవారం ఆర్ వో కార్యాలయంలో నామినేషన్ల స్క్రూట్ ని సమయములో తాము లేవనెత్తిన అభ్యంతరాలను గుడివాడ రిటర్నింగ్ అధికారి పట్టించుకోకపోవడం, తమను దుర్భాషలాడటం జరిగిందని గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు (Ravi Venkateswar Rao) అన్నారు. శుక్రవారం తాము కొడాలి నాని పై చేసిన ఆరోపణలకు సంబంధించి పూర్తి ఆధారాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించినా పట్టించుకోని ఆర్ వో ఈరోజు అదే ఆధారాలు మరలా సమర్పించమని టిడిపి నాయకుడు తులసి బాబుకు నోటీసులు ఎలా జారీ చేశారని రావి ప్రశ్నించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈరోజు కూడా తాము అదే ఆధారాలను ఆర్వో కు సమర్పించామని, తాము లేవనెత్తిన అభ్యంతరాలపై అధికారుల వద్ద నుండి సమాచారం తెప్పించకోవలసిన బాధ్యత ఆర్వోకు ఉందని అన్నారు. శుక్రవారం తాము సమర్పించిన ఆధారాలు తప్పుడు ఆధారాలుగా రిటర్నింగ్ అధికారి భావిస్తే ఈరోజు మరల అదే ఆధారాలను ఎలా సబ్మిట్ చేయమని నోటీసులు జారీ చేస్తారని అన్నారు. రిటర్నింగ్ అధికారి వైసిపికి అనుకూలంగా పనిచేస్తున్నారని, కొడాలి నాని అధికారులను భయభ్రాంతులకు, ప్రలోభాలకు గురిచేస్తున్నాడని రావి అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో తాము పోరాడుతున్నామని, ఎప్పటికైనా తామే విజయం సాధిస్తామని, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి పాలన నడుస్తుందని రావి అన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…