కేంద్రంలో ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. 71 మంది సహచరులతో నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయంలోకి అడుగుపెట్టిన మోదీ.. రైతుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యమిచ్చారు. పీఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్ పై తొలి సంతకం పెట్టారు. ముచ్చటగా మూడోసారి పీఎంవోలో అడుగుపెడుతున్న మోదీకి కార్యాలయ సిబ్బందితో పాటు పలువురు నేతలు ఘన స్వాగతం పలికారు. ఇరువైపులా నిల్చుని సంప్రదాయబద్ధంగా నమస్కరిస్తూ మోదీకి స్వాగతం చెప్పారు. సిబ్బంది అందరికీ నమస్కరిస్తూ మోదీ ప్రధానమంత్రి కార్యాలయంలోకి అడుగుపెట్టారు. తన సీటులో కూర్చున్న ప్రధాని మోదీ.. రైతులకు సంబంధించి పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధులను విడుదల చేసేందుకు అనుమతిస్తూ ఫైల్ పై సంతకం పెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 9.3 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమయ్యాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.