కడప జిల్లా…నగరంలో కీలకమైన ప్రాంతం రాజారెడ్డి వీధి. జిల్లా ఎస్పీ బంగ్లా నుంచి జిల్లా గ్రంధాలయం వరకు ఈ రహదారి మంచి వ్యాపార కేంద్రం. ఈ ప్రాంతం వ్యాపారులకు అడ్డా. ఎలక్ట్రానిక్ షోరూమ్స్ మొదలుకొని హోటల్స్..జిమ్ బ్యాంకులు.. ఇలా ఎన్నో వాటికి అడ్డా ఇది. ఇక్కడ బిజినెస్ కోసం సెంటు స్థలం దొరికితే చాలు ఆనందానికి హద్దులు ఉండవు. అలాంటి ప్రాంతంలో సుమారు 30 సెంట్ల స్థలం.. అందులోనూ సుమారు 15 కోట్ల విలువ చేసే స్థలం కనిపిస్తే ఊరుకుంటారా , కోట్ల విలువ చేసే స్థలం వైసిపి నేతలపరం…కడప కార్పొరేషన్ లో నెంబర్-2 గా చలామణి అవుతున్న వ్యక్తి కన్ను పడితే..వ్యూహాత్మకంగా పావులు కలిపి బినామీ పేరుతో సొంతం చేసుకుంటారు. ప్రస్తుతం ఈ స్థలం వివాదాస్పదంగా మారింది.
నగరంలోని రాజారెడ్డి వీధిలో పోలీస్ పెట్రోలు బంకు సమీపంలో ఖాళీ స్థలం ఉంది. పోలీస్ శాఖ కు సంబంధించిన ఈ స్థలంపై కార్పొరేషన్ పాలకవర్గంలో నెంబర్ 2 గా ఉన్న వైసీపీ నేత కన్ను పడింది. కడప లో కరుడు కట్టిన వైసిపి నాయకులకు తెలియకుండానే ఆయన వ్యూహాత్మకంగా సుమారు 15 కోట్ల విలువ చేసే 30 సెంట్ల స్థలాన్ని కాజేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. వివాదంలో ఉన్నప్పటికీ ఆ స్థలాన్ని అప్పటి పోలీస్ బాస్ ను మేనేజ్ చేసి మరీ ఒప్పందం చేసుకొని.. ఆ స్థలంలో తనదైన స్టైల్ లో నిర్మాణాలు కొనసాగించారు. ప్రభుత్వ మారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో ఆ స్థలం లీజు వ్యవహారం బయట పడింది. న్యాయస్థానంలో వివాదంలో ఉన్న స్థలాన్ని అప్పటి పోలీస్ బాస్ చడి చప్పుడు కాకుండా వైసిపి నేత బినామీకి కట్టబెట్టిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలిపల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి