అక్టోబర్ 2న ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ 2047 విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కలెక్టర్ లతో నిర్వహించిన కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రాధాన్యతలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుందని కలెక్టర్ లకు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలను కలెక్టర్ లు గౌరవించాలని తెలిపారు. ఇకపై తాను ఆకస్మిక తనిఖీలకు వస్తానని అధికారులు సిద్దంగా ఉండాలని హెచ్చరించారు. ఇదే సందర్భంలో 1995 లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐఏఎస్ లను డ్రైన్లలోకి దింపిన విషయాలను గుర్తు చేశారు. కలెక్టర్లు నిబంధనల వైపే కాకుండా మానవత్వ కోణంలోనూ పని చేయాలని సూచించారు. అక్టోబర్ 2న ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047 విడుదల చేస్తానని తెలిపిన సీఎం చంద్రబాబు.. జిల్లాలకు విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోవాలని సూచించారు. అలానే ఎప్పటికప్పుడు తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉంటూ వాటిని కౌంటర్ చేయాలని కలెక్టర్లు, అధికారులకు సూచించారు. గత అయిదేళ్ల పాలన ఐఏఎస్ వ్యవస్థను దిగాజార్చేలా సాగిందని విమర్శించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డియాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు. ఈవేళ సీఎం రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు కావడంతో హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాఫ్టర్‌లో యాదగిరి గుట్టుకు చేరుకున్నారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో వేద పండితులు ప్రత్యేక…
- బోరుగడ్డ అనిల్ కు రాచమర్యాదలుఏడుగురు పోలీసులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు వేటు వేసింది. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌ను జైలుకు తరలించే క్రమంలో ఆయనకు రాచమర్యాదలు చేశారు. బోరుగడ్డ అనిల్‌ను గన్నవరం క్రాస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్లోకి…
- గవర్నర్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..రాజ్ భవన్ లో గవర్నర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి…
- విజయవంతంగా ముగిసిన లోకేశ్ అమెరికా పర్యటనఅమెరికాలో ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో మంత్రి వరుసగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమదారుల్లో…
- వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంవయనాడ్లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వయనాడ్ ప్రజల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటన తర్వాత తాను కేరళకు తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి వచ్చానని, ఆ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి