మూసీ సుందరీకరణ ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు అధికారులతో కలిసి సచివాలయం వేదికగా మూసీపై ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ నదిలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారులు గుర్తించారు. మొత్తం 33 బృందాలు మూసీపై అధ్యయనం చేశాయి. పది నెలలుగా అధికారులు నిద్రాహారాలు మానేసి పనిచేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ధేశించే ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. విప్లవాత్మక నిర్ణయాలను అడ్డుకునే, వ్యతిరేకించే వాళ్లు అడుగడుగునా ఉంటారు. వారిని పట్టించుకుంటే మనం ముందుకు వెళ్లలేం అని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివిసించే వారి వివరాలు సేకరించామని, దుర్భర స్థితిలో ఉన్నవారికి మెరుగైన జీవితాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వెళ్తోందని తెలిపారు.
ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాము నిద్రాహారాలు మాని పనిచేసేది అద్దాల కోసం కాదు.. అందాల భామల కోసం కాదు. రాష్ట్ర భవిష్యత్తు కోసమని వెల్లడించారు. నాలుగు యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకొని అధికారంలోకి రావాలనుకోవడం కలే అవుతుందని కేటీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. దుబాయ్ వెళ్లి జుట్టుకు నాట్లు వేయించుకునే వాళ్ల కోసం కాదు మూసీ సుందరీకరణ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బందిపోటు దొంగళ్లా పదేళ్లు రాష్ట్రాన్ని పీడించి దోచుకున్నారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేయాల్సిన అవినీతి మొత్తం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాము మూసీకి జీవం పోస్తుంటే చూస్తూ ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కళ్లమంటతోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. దీనిపై చర్చించడానికి తాను సిద్ధమని.. గజ్వేల్ అయినా వస్తా, వేములవాడకైనా వస్తా, కిష్టాపూర్‌కు అయినా వస్తానన్నారు. సెక్యూరిటీ లేకుండా వస్తా.. సిద్ధమా? అని బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు. మూసీ మొత్తం 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సర్వమతాలకు ప్రతీక మూసీ నది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి