పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ మానేపల్లి సింగ్ పై పోక్స్ కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై జయలక్ష్మి తెలిపారు. పట్టణంలోని ఒక ప్రాంతంలో ఒంటరిగా ఉన్న బాలికపట్ల హెడ్ కానిస్టేబుల్ సింగ్ అసభ్యంగా ప్రవర్తించాడనినరసాపురం హెడ్ కానిస్టేబుల్ ను చితకబాదిన మహిళలు దేహ శుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రాంతాన్ని సందర్శించి వివరాలు సేకరించి అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ సింగ్ పశ్చిమగోదావరి జిల్లాలోని పోడూరు పోలీస్ స్టేషన్లో విధుల నిర్వహిస్తూ గత కొంతకాలంగా సెలవులో ఉన్నారు. ప్రజలకు రక్షణ కల్పించవలసిన పోలీసు వ్యవస్థ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటని మహిళా సంఘాలు ప్రజానాయకులు మండిపడుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీటాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ. గత వారం రామ్ గోపాల్ వర్మపై ఐటీ చట్టం కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై నేడు విచారణకు హాజరుకావాల్సి ఉండగా..…
- రేపు జార్ఖండ్ లో రెండో విడత పోలింగ్రేపు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు, జార్ఖండ్‌లో 38 స్థానాలకు రేపు జరిగే ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తుంది.జార్ఖండ్‌లో ఆల్రెడీ ఒక దశ ఎన్నికలు పూర్తికాగా.. రెండో దశలో 38 స్థానాలకు…
- అయ్యప్ప దర్శనానికి 10 గంటలుశబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు రావడంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. ఇక, అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. సన్నిధానం నుంచి పంబ వరకూ…
- కాగ్ చీఫ్ గా తెలుగు ఐఏఎస్ కె.సంజయ్ మూర్తికంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి నియమితులయ్యారు. కాగ్‌కు చీఫ్‌గా ఓ తెలుగు వ్యక్తి నియమితులవడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను 15వ కాగ్‌గా నియమించినట్టు కేంద్రం వెల్లడించింది. సంజయ్‌మూర్తి…
- రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తాందేశంలో రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తాం అని, అంతేగాక కులగణన నిర్వహిస్తామని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కులగణన అతిపెద్ద సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి