Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Telangana ఈ వార్త టెట్ కు దరఖాస్తు చేసుకున్న వారి కోసమే…

ఈ వార్త టెట్ కు దరఖాస్తు చేసుకున్న వారి కోసమే…

by Rama
ఈ వార్త టెట్ కు దరఖాస్తు చేసుకున్న వారి కోసమే…

తెలంగాణ TET కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు విద్యాశాఖ కీలక అప్ డేట్ జారీ చేసింది. ఆన్ లైన్ దరఖాస్తులు నవంబర్‌ 20 బుధవారం అర్ధరాత్రితో ముగిసింది. టెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,75,773 దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వీటిల్లో పేపర్‌ 1 పరీక్షకు 94,335 దరఖాస్తులు, పేపర్‌ 2 పరీక్షకు 1,81,438 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంది. ఇక దరఖాస్తు వివరాల్లో పొరపాట్లు సవరించుకునేందుకు కూడా విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ఈ అవకాశం నేటితో గడువు ముగియనుంది. ఈ మేరకు అర్ధరాత్రి లోగా వివరాలు సవరించుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నర్సింహారెడ్డి తెలిపారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ టెట్ హాల్ టికెట్లు డిసెంబర్ 26న విడుదలవుతాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి జనవరి 20వ తేదీ వరకు టెట్‌ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతాయి.


ప్రతి రోజు రెండు పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయ‌నున్నారు. ఉద‌యం 9 నుంచి 11.30 గంటల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నాం 2 గంట‌ల నుంచి 4.30 గంట‌ల వ‌ర‌కు నిర్వహించ‌నున్నారు. ఇక టెట్ ఫలితాలు ఫిబ్రవ‌రి 5వ తేదీన వెల్లడించ‌నున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. టెట్‌ పరీక్షలో మొత్తం రెండు పేపర్లకు పరీక్ష ఉంటుంది. ఒక్కో పేపర్‌ 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. OC అభ్యర్థులకు 90 మార్కులు, BCలకు 75 మార్కులు , SC 60 మార్కులు సాధిస్తే టెట్‌లో ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. TET లో అర్హత సాధించిన వారికి మాత్రమే DSC రాసేందుకు అవకాశం లభిస్తుంది. టెట్‌ పరీక్షల్లో వచ్చిన మార్కులకు డీఎస్సీ నియామకాల్లో 20 శాతం వెయిటేజ్ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే కొత్త DSC నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: