తెలంగాణ TET కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు విద్యాశాఖ కీలక అప్ డేట్ జారీ చేసింది. ఆన్ లైన్ దరఖాస్తులు నవంబర్ 20 బుధవారం అర్ధరాత్రితో ముగిసింది. టెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,75,773 దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వీటిల్లో పేపర్ 1 పరీక్షకు 94,335 దరఖాస్తులు, పేపర్ 2 పరీక్షకు 1,81,438 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంది. ఇక దరఖాస్తు వివరాల్లో పొరపాట్లు సవరించుకునేందుకు కూడా విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ఈ అవకాశం నేటితో గడువు ముగియనుంది. ఈ మేరకు అర్ధరాత్రి లోగా వివరాలు సవరించుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ టెట్ హాల్ టికెట్లు డిసెంబర్ 26న విడుదలవుతాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి జనవరి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరుగుతాయి.
ప్రతి రోజు రెండు పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నాం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇక టెట్ ఫలితాలు ఫిబ్రవరి 5వ తేదీన వెల్లడించనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. టెట్ పరీక్షలో మొత్తం రెండు పేపర్లకు పరీక్ష ఉంటుంది. ఒక్కో పేపర్ 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. OC అభ్యర్థులకు 90 మార్కులు, BCలకు 75 మార్కులు , SC 60 మార్కులు సాధిస్తే టెట్‌లో ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. TET లో అర్హత సాధించిన వారికి మాత్రమే DSC రాసేందుకు అవకాశం లభిస్తుంది. టెట్ పరీక్షల్లో వచ్చిన మార్కులకు డీఎస్సీ నియామకాల్లో 20 శాతం వెయిటేజ్ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే కొత్త DSC నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్.పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “ఎస్ ఆర్ కళ్యాణమండపం” డైరెక్టర్ శ్రీధర్ గాదె, శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.3 సినిమా “ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్…
- “15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.“15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా..” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్ తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే ‘పంచనామా’ సిరీస్.…
- హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై ఏగన్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హైకూ’. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ రొమాంటిక్ హీరో హరీష్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్,…
- ఘనంగా “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.ఈ నెల 18న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు,…
- ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.బానోత్ పవన్, గౌతమ్, నర్మద, సతీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “ఐ బొమ్మ”. ఈ చిత్రాన్ని శ్రీ మల్లన్న క్రియేషన్స్ బ్యానర్ పై కురువ జమన్న నిర్మిస్తున్నారు. విజయ్ రఘునాథభట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలో వరల్డ్ వైడ్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి