పంజా విసురుతున్న చలి పులి….

A clawing cold tiger

Advertisements

&NewLine;<p>అల్లూరి జిల్లా పాడేరులో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాడేరు వణికిపోతోంది&period; చలి పులి పంజా విసరడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు&period; చలిమంటలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు&period; పొగమంచు కమ్మెయ్యడంతో రహదారుల్లో ముందు ఏం ఉందో కనిపించడం లేదు&period; దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని వెళుతున్నారు వాహనదారులు&period; చలి పులి పంజా విసరడంతో విశాఖ ఏజెన్సీ వణికిపోతోంది&period; పాడేరులో పట్టపగలే వాహనాల లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది&period; మన్యం మంచు దుప్పటి కప్పుకుంది&period; మిచౌంగ్‌ తుఫాన్‌ తర్వాత నుంచి అల్లూరి జిల్లా పాడేరు చలితో గజగజా వణికిపోతూనే ఉంది&period; తాజాగా చలి తీవ్రత మరింత పెరిగింది&period; పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువవడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి&period; పొగమంచు దట్టంగా అలుముకుంటోంది&period; ఎంత పొద్దెక్కినా సూర్యుడు కనిపించకపోగా&comma; మంచు దుప్పటి కమ్మేస్తోంది&period; దీంతో వాహనదారులు నానా ఇక్కట్లు పడుతున్నారు&period; పాడేరులో పగలైనా సరే&comma; వాహనం బయటకు తియ్యాలంటే లైట్లు ఆన్‌ చెయ్యాల్సిందే&period; ఇక ముంచంగిపుట్టులో చలి తీవ్రతకు జనం చలిమంటలను ఆశ్రయిస్తున్నారు&period; మన్యంలో చలి తీవ్రత కొనసాగుతున్నది&period; క్రమంగా ఉష్ణోగ్రతలు దిగజారుతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది&period; దీంతో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చలి తీవ్రత కొనసాగుతోంది&period; ఇక సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి మొదలవుతోంది&period; దీంతో కొద్ది సమయం లోపలే ప్రజలు పనులు చక్కపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది&period; ఇక ముంచంగిపుట్టు&comma; హుకుంపేట&comma; పెదబయులు&comma; జి మడుగుల మండలాల పరిధిలో గత మూడు రోజులుగా చలి తీవ్రత పెరిగింది&period; ఉదయం పూట పది గంటల వరకు హుకుంపేట లో మంచు తెరలు వీడడం లేదు&period; చలికి జనం గజగజ వణికిపోతున్నారు&period; సాయంత్రం అయితే చాలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు&period; సాయంత్రం నాలుగు గంటల తరువాత వీధుల్లో చలి మంటలు దర్శనమిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.