పూణేకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ సొంత గ్యాంగ్ చేతిలో కాల్చివేతకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 8 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడుపిస్తోళ్లు, మూడు మ్యాగజైన్లు, ఐదు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిన్న మధ్యాహ్నం 1.30 సమయంలో సుతార్దారా ప్రాంతంలో గ్యాంగ్‌స్టర్ మొహొల్ (40)పై నలుగురు దుండగులు పాయింట్ రేంజ్లో కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ అతడి చాతీని చీల్చేయగా, మరో రెండు అతడి కుడిభుజంలోకి చొచ్చుకెళ్లాయి. కోత్రుద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మొహొల్ చికిత్స పొందుతూ మరణించినట్టు పోలీసులు తెలిపారు. మొహొల్పై పలు హత్య, దోపిడీ కేసులు ఉన్నాయి. ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది మొహమ్మద్ ఖతీల్ సిద్ధిఖీని యరవాడ జైలులో హత్యచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ నిర్దోషిగా బయటపడ్డాడు. కాగా,మొహుల్ హత్యకు భూ తగాదాల తో పాటు డబ్బులు సంబంధించిన గొడవే కారణమని పోలీసులు తెలిపారు. ఇది గ్యాంగ్‌వార్ కాదని, సొంత గ్యాంగ్ చేతిలోనే మొహొల్ హత్యకు గురయ్యాడని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.
ఓ గ్యాంగ్‌స్టర్ సొంత గ్యాంగ్ చేతిలో హత్య..!
89
previous post