ఇటీవల యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. కానీ యాపిల్ ఈ సంవత్సరం అప్‌డేట్ చేసిన ఐప్యాడ్ మోడల్‌ను లాంచ్ చేయలేదు. అయితే ఈ బ్రాండ్ వచ్చే ఏడాది మొత్తం ఐప్యాడ్ లైనప్‌ను రిఫ్రెష్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఐప్యాడ్ ఎయిర్‌కి సంబంధించిన కొత్త వార్త ఒకటి గాడ్జెట్ లవర్స్‌ను ఆకర్షిస్తోంది. అదేంటంటే.. యాపిల్ 2024లో ఐప్యాడ్ ఎయిర్ 12.9-అంగుళాల మోడల్‌ను రిలీజ్ చేయనుంది. ప్రస్తుత 10.9-అంగుళాల వేరియంట్‌కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రిలీజ్ కానుంది. ఈ 12.9-అంగుళాల ఐప్యాడ్ మోడల్‌లో.. 12.9-అంగుళాల ఐప్యాడ్ ప్రోలో అందించిన మినీ LED డిస్‌ప్లే టెక్నాలజీ ఉండదని మింగ్-చి కువో పేర్కొన్నారు. దీనికి బదులుగా కంపెనీ కొత్త ప్రొడక్ట్‌ను LCD డిస్ప్లేతో అందిస్తుందని చెప్పారు. అయినా కూడా ఇది 10.9-అంగుళాల మోడల్ కంటే బెటర్ వెర్షన్‌గా నిలవనుంది. ఎందుకంటే ఇది ఐప్యాడ్ ప్రో 12.9-అంగుళాల మోడల్ మాదిరిగానే ఆక్సైడ్ బ్యాక్‌ప్లేట్‌తో వస్తుంది. వీటిలో a-Si బ్యాక్‌ప్లేట్ ఉండదు.
వచ్చే ఏడాది మార్కెట్లోకి కొత్త ఐప్యాడ్..
62
previous post