శ్రీకాకుళం జిల్లా… ఇచ్ఛాపురం… నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై టిడిపి జనసేన ఉమ్మడి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అద్వానంగా ఉన్న రాజపురం- కమలాయిపుట్టుగ రహదారి వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్ల దుస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మీడియాతో మాట్లాడారు. టిడిపి ప్రభుత్వ హాయంలో ఇచ్చాపురం నియోజకవర్గంలో సుమారు 85 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేశామని, వైసిపి ప్రభుత్వం రహదారుల దుస్థితిని గాలికి వదిలేసిందని అన్నారు. తమ ఉమ్మడి నిరసన కార్యక్రమాలను డిజిటల్ క్యాంపైనింగ్ ద్వారా మరింత విస్తృతంగా, ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. అధ్వానంగా ఉన్న రహదారులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని జనసేన నాయకులు దాసరి రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నేతలు పాల్గొన్నారు…
రోడ్ల దుస్థితిపై నిరసన కార్యక్రమం..
67
previous post