Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Film చేగువేరా బయోపిక్ “చే” మూవీ సెన్సార్ పూర్తి

చేగువేరా బయోపిక్ “చే” మూవీ సెన్సార్ పూర్తి

by Rama
cheguvera biopic

క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో రూపొందుతున్న మూవీ “చే”. లాంగ్ లైవ్ అనేది ట్యాగ్ లైన్. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌పై బీఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. “తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది..ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు యు/ ఎ సర్టిఫికెట్ జారీ చేశారు.. .

క్యూబా తరువాత ప్రపంచంలోనే తొలిసారి భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న చేగువేరా బయోపిక్ ఇది. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా ఈమూవీ ఫస్ట్ లుక్ కు ,
లేటేస్ట్ గా రిలీజైన టీజర్ ,ట్రైలర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది..

దర్శకుడు బి.ఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ.. “చేగువేరా బ‌యోపిక్ తీయాల‌న్న‌ది త‌న ఇర‌వై ఏళ్ల క‌ల అని అన్నారు. విప్లవ వీరుడు చేగువేరా లైఫ్‌లో జ‌రిగిన‌ ఎన్నో అరుదైన విష‌యాలు త‌మ సినిమాలో చూపించిన‌ట్టు తెలిపారు. అనాటి పరిస్థితులను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు తెర‌కెక్కించామ‌ని, క్వాలిటీ విష‌యంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేద‌ని చెప్పారు. తాజాగా మా సినిమా ను వీక్షించిన సెన్సార్ సభ్యులు యు/ ఎ సర్టిఫికెట్ జారీ చేశారు. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌ థియేట‌ర్‌ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు బి.ఆర్ సభావత్ నాయక్ తెలిపారు.

నటీనటులు: లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్ నాయక్.
నిర్మాతలు: సూర్య, బాబు, దేవేంద్ర
కో డైరెక్టర్: నాని బాబు
రచయిత, దర్శకుడు: బి.ఆర్ సభావత్ నాయక్
బ్యానర్: నేచర్ ఆర్ట్స్
పబ్లిసిటి డిజైనర్: వివ రెడ్డి పోస్టర్స్
డీవోపీ: కళ్యాణ్ సమి, జగదీష్
ఎడిటర్: శివ శర్వాణి
సంగీత దర్శకుడు : రవిశంకర్
పీఆర్ఓ: దయ్యాల అశోక్

Advertisements

You may also like

Our Visitor

039208
Total views : 194768

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: