ప్రపంచంలో అత్యంత ఖరీదైన, అరుదైన జాతి కుక్క కాకసియాన్ షెఫర్డ్ డాగ్ హైదరాబాద్ మియాపూర్ లో సందడి చేసింది. 20 కోట్ల విలువ చేసే ఈ కుక్క తో సెల్ఫీలు దిగడానికి జనం ఎగబడ్డారు. బెంగుళూరుకు చెందిన ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ ఈ డాగ్ ను నగరానికి తీసుకొచ్చాడు. మియాపూర్ మదీనాగూడ లో గల విశ్వాస్ పెట్ క్లినిక్ కు ఈ డాగ్ ను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బ్రీడ్ రష్యా కు చెందినదన్నారు.
20 కోట్ల కు కోనుగోలు చేసినట్లు తెలిపారు. మూడు సంవత్సరాల వయసు కలిగిన ఈ డాగ్ రోజుకు మూడు కేజీల చికెన్ ను ఆహారంగా తీసుకుంటుదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రదర్శనలో తో పాటు సినిమాలలో కూడా నటించినట్లు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా పలు భారీ ఫంక్షన్ లకు వీఐపీ పాలుపంచుకున్నట్లు సతీష్ వివరించారు. ఈ డాగ్ మెయింటినెన్స్ కి మూడు లక్షలు ఖర్చు అవుతుందని వివరించారు.
మియాపూర్ లో సందడి చేసిన అరుదైన జాతి కుక్క..
72
previous post