తేగలు పై ప్రత్యేక కథ….

A special story on Tegalu....

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం పేరు చెబితే తెలియని వారంటూ ఎవరు ఉండరు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న బీచ్ పర్యాటక ప్రాంతంగా అందరికీ పరిచయమే ఈ ప్రాంతంలో లభించే తేగలు ఒక్కసారి రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించెలా ఉంటాయి&period; అయితే తేగలు తినాలి అంటే వాటి కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది&period; తాటి చెట్టు నుండి లభించే తాటి పండ్ల ను ఒక స్థలంలో కుప్పగా వేసి దాదాపుగా 3 నెలల కాలం ఉంచితే వాటి నుండి వచ్చే మొలకలేనే తేగలు అంటారు&period; వాటిని తీసి&comma; కాల్చడం పెద్ద ప్రొసస్ అనే చెప్పాలి&period; ప్రతి ఏటా సుబ్రహ్మణ్యేశ్వర షష్టికి ముందు వచ్చే నాగుల చవితి పండుగ రోజునే పాత్రగా వేసిన తేగలను పాత్రనుండి తీసి వేరుచేసి తేగల నుండి బుర్రలను వేరు చేసి ఒక కుండలో పెట్టీ తేగలను తంపడ వేస్తారు&period; మట్టి కుండలో వేసి తంపడ వేసిన తేగలు చాలా మధురంగా ఉంటాయి&period; అందులోనూ పేరుపాలెం తీర ప్రాంతాల్లోని తేగలు మంచి రుచి కలిగి ఉండటంతో హైదరాబాద్&comma; చెన్నై&comma; బెంగుళూరు వంటి ప్రదేశాలకే కాకుండా కువైట్&comma; దుబాయ్ వంటి ఇతర దేశాలలో వుండే బంధువులు&comma; స్నేహితులకు ఈ ప్రాంతాల నుండి పంపుతూ ఉంటారు&period; అయితే దీనిపై ఆధారపడి నిరుపేద కుటుంబాలకు చెందిన అనేక మంది జీవనం సాగిస్తున్నారు&period; ఎంతో శ్రమిస్తున్న కనీసం కూలీ పని డబ్బులు కూడా రావడం లేదని తేగలు&comma; డొక్కలు కొనుగోలుకు ఖర్చు పెట్టే డబ్బులు కూడా రావడం లేదని ప్రభుత్వం తమను ఆదుకొని సహకారం అందించాలని ఆ వృత్తి పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు కోరుతున్నారు&period; కుటీర పరిశ్రమలకు చేయూత అందిస్తున్నట్లు గా తమకు కూడా ప్రభుత్వాలు బ్యాంక్ లోన్ లు మంజూరు చేస్తే బాగుంటుందని ఈ చిరు వ్యాపారులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్