కుప్పంలో వింత జాతర…

A strange fair in the heap

Advertisements

&NewLine;<p>కుప్పంలో వింత జాతర నేటికీ కొనసాగుతోంది&period; తమిళుల సాంప్రదాయం ప్రకారం మహా శివరాత్రి పర్వదినం మరుసటి రోజు వచ్చే అమావాస్య రోజున శ్మశానకొళ్లు అనే జాతరను ఘనంగా నిర్వహించారు&period; కుప్పంలోని శ్మశానవాటికలో మట్టితో అతిపెద్ద అంగాళ పరమేశ్వరి దేవి ప్రతిమను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు&period; పూనకం వచ్చిన మహిళలు&comma; యువకులు అంగాళ పరమేశ్వరి చుట్టూ తిరిగి పూజలు చేస్తారు&period; అనంతరం కొరడాలతో కొట్టించుకుంటే మంచి జరుగుతుందంటూ కొరడా దెబ్బలు తింటారు&period; ఈ కొరడా దెబ్బలు తినేందుకు భక్తులు పోటీపడడం విశేషం&period;మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని కుప్పం పట్టణంలోని కొత్తపేటలో వెలసిన శ్రీ ప్రసన్న అంగాళ పరమేశ్వరి జాతరను గ్రామ సాంప్రదాయంగా ప్రతియేటా బెస్త కులస్తులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు&period; ఈ జాతరను చూసేందుకు తమిళనాడు&comma; కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నుంచి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు&period; మహాశివరాత్రి మరుసటి రోజు అమావాస్య పురస్కరించుకొని శ్మశానంలో బెస్త కులస్తులు పూజలు చేపట్టారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>శ్మశానంలో ఏర్పాటు చేసిన శిలా దేవుని మట్టిబొమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; అంగాళ పరమేశ్వరి వేషధారణలో భక్తాదులు పూనకంతో ఊగి పోయారు&period; అంగాళ పరమేశ్వరి ఉత్సవ విగ్రహాన్ని శ్మశానం వద్దకు తీసుకొని వచ్చి అంగరంగ వైభవంగా పూజలు చేపట్టారు&period; అనంతరం అక్కడ ఉన్న సమాధులను తవ్వి&comma; బుర్రలను నోట్లో పెట్టుకొని చెరుకు గడ్డలా కరకరమని నమిలారు&period; ఆలయ సాంప్రదాయం ప్రకారం ఎవరికైనా భూత పిశాచి&comma; గాలి&comma; దయ్యాలు పట్టి ఉంటే&comma; ఆలయ పూజారులు కొరడా దెబ్బలతో కొట్టి శ్మశానవాటికలో తరిమి వేస్తారు&period; ఈ నేపథ్యంలో శ్మశానవాటికలో చాలా మంది యువకులు&comma; పెద్దలు చేతులు చాపి మరి కొరడా దెబ్బలు పూజారుల చేతుల మీదుగా కొట్టించుకున్నారు&period; అనంతరం పూజ ముగిసిన తర్వాత భక్తులు అక్కడున్న శ్మశానంలో ఏర్పాటుచేసిన శిలా దేవుని విగ్రహ బొమ్మ మట్టిను ఇళ్లకు తీసుకెళ్లారు&period; ఈ మట్టిని తమ ఇంటిలో పెట్టుకుంటే దయ్యాలు&comma; భూత&comma; పిశాచులు రావని ఇక్కడ వారి నమ్మకం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…

మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం..

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..