తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు తీపి కబురు అందించింది. ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయ నుంది. మార్చి మాసానికి సంబంధించిన దర్శన, సేవా టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ నమోదు కోసం భక్తులకు అవకాశం లభిస్తుంది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 20వ ఉదయం 10 గంటల వరకు నమోదు ప్రక్రియ ఉంటుందని టీటీడీ తెలిపింది. 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల విడుదల చేస్తారు. 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి తెప్పోత్సవాల టికెట్ల విడుదలవుతాయి. 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్ల విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వృద్దులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు. దాతల దర్శనం, గదుల కోటా వెలువరిస్తారు. 25న ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది.
శ్రీవారి భక్తులకు తీపి కబురు…..
81
previous post