కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం అంకుశపూర్ అటవీ ప్రాంతంలో గులాబ్ అనే పశువుల కాపరిపై పెద్దపులి దాడి చేసింది. మండలంలోని వంజిరి గ్రామానికి చెందిన గులాబ్ ప్రతిరోజు మాదిరిగానే పశువులను అంకుశపూర్ అటవీ ప్రాంతంలో మేపుతుండగా వెనక నుంచి వచ్చిన పెద్దపులి ఆకస్మాత్తుగా అతనిపై దాడికి దిగినట్టు బాధితుడు తెలిపాడు. వెంటనే తేరుకొని కర్ర ను చేత పట్టగానే పారి పోయిందని కాపరి తెలిపాడు. సమీపంలోని రోడ్డు వద్దకు వెళ్లి జరిగిన సంఘటనను స్థానికులకు తెలుపడం తో కాపారిని ఆసుపత్రికి తరలించరు. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకొని బాధితుడి అడిగి వివరాలు తెలుసుకున్నారు. వైద్యులు గాయలైన కాపారికి వైద్యంన్ని చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి ఏమి లేదని వైద్యులు నిర్దారించారు.
పశువుల కాపరిపై పెద్దపులి దాడి..
58
previous post