ఉన్నత వైద్య విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన ఓ యువతి ఆశలు ఆవిరయ్యాయి. కారులో ప్రయాణిస్తూ గ్యాస్ లీక్ అయి మృత్యువాత పడ్డారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహీరా నాజ్ ఫిజియోథెరపీ డిగ్రీ పూర్తి చేశారు. ఎంఎస్ చేయడానికి ఈ ఏడాది ఆగస్టులో అమెరికాలోని షికాగోకు వెళ్లారు. అయితే ఆమె బుధవారం కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో కారు డ్రైవర్‌తో పాటు జహీరా నాజ్ స్పృహ తప్పారు. గమనించిన కొందరు వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లిన తమ కూతురు అర్ధాంతరంగా ఇలా చనిపోతుందని ఊహించలేకపోయామంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జహీరా నాజ్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Read Also..
Read Also..