64
ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అనేక అవకాశాలు ఇచ్చింది. తాజాగా, ఆధార్ వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం మరోసారి గడువు పొడిగించింది. గతంలో పొడిగించిన గడువు ఈ డిసెంబరు 14తో ముగియనుంది. తాజాగా గడువు పొడిగించిన మేరకు 2024 మార్చి 14 వరకు ఆధార్ అప్ డేట్ ఉచితం కానుంది. గడువు ముగిసిన తర్వాత ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవాలంటే రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు పొంది పదేళ్లు పూర్తయితే తప్పనిసరిగా తమ డెమొగ్రాఫిక్ వివరాలు అప్డేట్ చేసుకోవాలని కేంద్రం చెబుతోంది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారక సంస్థ నిబంధనల మేరకు తాజా ఐడీ కార్డుతో చిరునామా వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.