పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

Advertisements

<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది&period; సముద్ర వేటకు వెళ్లిన బోటు&period;&period; ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది&period; బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి&period;&period; ఈదుకుంటూ ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నించారు&period; సమాచారం తెలుసుకున్న చిన్నలంక గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై&period;&period; పడవలపై సముద్రంలోకి వెళ్లి ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు&period; వీరంతా కాకినాడకు చెందిన మత్స్యకారులుగా గుర్తించారు&period; ఏడు రోజుల క్రితం వేటకు బయలుదేరిన బోటులో సాంకేతిక సమస్య తలెత్తడంతో&period;&period; మరో బోటు సహాయంతో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది&period; సమాచారం అందుకున్న పోలీసులు చిన్నలంకకు చేరుకుని&period;&period; మత్స్యకారులను పునరావాస కేంద్రానికి తరలించారు&period; గ్రామస్తుల సమయస్ఫూర్తితో ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

22ఏపై బీజేపీ దీక్షలు.

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.