చంద్రబాబు నాయుడుకు స్కిల్ స్కాం కేసులో బెయిల్ రావడంతో టిడిపి, కపిలేశ్వర ఆలయంలో గుండు కొట్టించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు
టిడిపి అధినేత చంద్రబాబు కు హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో తిరుపతి అలిపిరి మెట్ల దగ్గర టిడిపి, జనసేన నేతలు,కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.తమ అధినేతకు అడ్డంకులు తొలగిపోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ లో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
టిడిపి నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పై కక్షపూరితంగా కేసులు పెట్టి జైలు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావడంతో న్యాయం గెలిచిందని, ఎలాంటి అవినీతి చేయిని చంద్రబాబు నాయుడు పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా అక్రమంగా అరెస్టు చేశారని మండి పడ్డారు. ముఖ్యమంత్రి పద్నాలుగు కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడని, అధికారి పార్టీ గుర్తు తెచ్చుకోవాలని, చంద్రబాబు నాయుడు మచ్చలేని నాయకుడని తెలిపారు. చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో కూడా నిర్దోషిగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు బెయిల్ సంబరాలు చేసుకున్న కార్యకర్తలు..
74
previous post