సినీ నటుడు విజయ్‌ పార్టీ టీవీకేకు తొలి షాక్ ..

Advertisements

<p>తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ&period;&period; సినీ నటుడు విజయ్‌ పార్టీ టీవీకేకు తొలి షాక్ తగిలింది&period; పోటీ చేయకుండానే ఒక స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది&period; ఆ పార్టీ అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురి కావడమే దీనికి కారణం&period; ఎడప్పాడి శాసనసభ స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌కు ప్రపోజర్ల సంతకాలు సరిపోలేదు&period; దీంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది&period; ఈ నియోజకవర్గం నుంచి విజయ్ పార్టీ తరపున బరిలోకి దిగిన అరుణ్ కుమార్ నామినేషన్‌ను అధికారులు పరిశీలించారు&period; అయితే&comma; నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న ప్రపోజర్ల వివరాలు ధ్రువీకరించలేకపోవడంతో రిటర్నింగ్ అధికారి ఆ దరఖాస్తును తిరస్కరించారు&period; ప్రధాన అభ్యర్థితో పాటు ఆ పార్టీ వేసిన ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్ కూడా ఇదే కారణంతో తిరస్కరణకు గురి కావడం గమనార్హం&period; మాజీ సీఎం&comma; ఏఐఏడీఎంకే కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి వరుసగా ఆరోసారి విజయం సాధించేందుకు సిద్ధమయ్యారు&period; అధికార పార్టీ డీఎంకే నుంచి సి కాశీ బరిలోకి దిగారు&period; వీరిద్దరి నామినేషన్లు ఆమోదం పొందాయి&period; ఈ నెల 23à°¨ తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.