నల్లమల అటవీ ప్రాంతంలో భారీ కార్చిచ్చు చెలరేగింది..

Advertisements

<p>నల్లమల అటవీ ప్రాంతంలో భారీ కార్చిచ్చు చెలరేగింది&period; నంద్యాల జిల్లా&comma; మహానంది మండలం పరిధిలోని దయ్యాలతిప్ప&comma; మోకాళ్ల తిప్ప&comma; మోటు అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి&period; మంటలు అదుపులోకి రాకుండా విస్తరిస్తూనే ఉన్నాయి&period; సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు&comma; సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు&period; అయితే&comma; ప్రమాదం జరిగిన ప్రాంతం ఎత్తైన కొండలపై ఉండటం&comma; కాలినడకన వెళ్లేందుకు మార్గం కష్టతరంగా మారడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది&period; వేసవి కాలం కావడంతో అడవిలో చెట్లు&comma; ఆకులు పూర్తిగా ఎండిపోయి ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి&period; కొందరు ఆగంతకులు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టి ఉంటారని స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p>ఈ కార్చిచ్చు కారణంగా నల్లమల అడవిలోని పులులు&comma; చిరుతలు&comma; జింకలు&comma; అడవి పందులు వంటి వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది&period; వీటితో పాటు ఎంతో విలువైన&comma; అరుదైన వనమూలికలు&comma; అటవీ సంపద అగ్నికి ఆహుతవుతున్నాయి&period; భూమార్గంలో మంటలను ఆర్పడం కష్టసాధ్యమని&comma; హెలికాప్టర్ ద్వారా నీటిని చల్లితేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు&period; ఇదే ప్రాంతంలో గత నెలలో కూడా కార్చిచ్చు చెలరేగగా&comma; అప్పుడు అధికారులు దాన్ని అదుపులోకి తెచ్చారు&period; ఇప్పుడు మరోసారి భారీగా మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.